తెలంగాణ ప్రజా సేన పార్టీ వ్యవస్థాపకులు బొమ్మ కంటి రమేష్ వర్మ

ములుగు జిల్లా ఆగస్టు 11( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని రమేష్ వర్మ డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ లు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని, దీనిపై మంత్రి సీతక్క అర్హులైన నిరుపేదలకు ములుగు పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ లు పూర్తి చేసి నిరుపేదలకు మంజూరు చేయాలని అన్నారు.ఇంటి స్థలం లేక ఇల్లులేక కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న బీద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిరుపేదలకు అందించాలని రమేష్ వర్మ కోరారు