
ఆగస్ట్ 11 ( కరీంనగర్ ప్రతినిధి )
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణా :
కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక v4 హాల్ లో సెలబ్రేటీ మేకప్ ఆర్టిస్ట్ ఉమా చౌదరి శిక్షణ లో మహిళలకి మేకప్ మరియు హెయిర్ విభాగం లో మెలకువలు నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బ్యూటీ అసోసియేషన్ నుండి రూప, లావణ్య, జ్యోతి, మాధవి, అంజలి, రవి వర్మ తో పాటు సిబ్స్ ఫౌండర్ డాక్టర్ స్వప్నరావు, మేము సైతం ఫౌండేషన్ చకిలం స్వప్న,జవెద్ అభిబ్స్ సెలూన్స్ మమత రాయ్ తదితరులు పాల్గొని ఉచిత సెమినార్ నిర్వహించిన అసోసియేషన్ సభ్యులను అభినందించడం జరిగింది.ఈ సెమినార్ కి హాజరైన మహిళలు అసోసియేషన్ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.