బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కోగిల మహేష్

ములుగు జిల్లా ఆగస్టు 11(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మరుగుదొడ్లను మరమ్మత్తులు చేసి ప్రయాణికులకు అసౌకర్యాలు కలగకుండా అందించాలని కోయిల మహేష్ కోరారు. ఇటీవలే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక మంత్రి సీతక్క ఆరు నెలల్లో బస్టాండ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం అని చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోవాలని కోగిల మహేష్ సూచించారు.ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్న బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం హడావిడిగా ప్రారంభిస్తున్నట్లు శంకుస్థాపనలు చేయడం విస్మరించడం సరి కాదన్నారు.పాత బస్టాండ్ కులగోట్టి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరుగుదొడ్లకు తాళాలు వేస్తూ దాని వల్ల ప్రయాణికులు ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వాటికి మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకు రావాలని కోగిల మహేష్ డిమాండ్ చేశారు.కేవలం శంకుస్థాపనలు చేసి పనులను మరచి పోవడం సరికాదని ఇప్పటికైనా పనులను ప్రారంభించి వేగంగా బస్టాండ్ ను నిర్మించి ప్రజలకు అందించాలని కోగిల మహేష్ కోరారు