బిజెపి జిల్లా నాయకులు కత్తి హరీష్ గౌడ్

మల్లంపల్లి ములుగు జిల్లా ఆగస్టు 11( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో మల్లంపల్లి దగ్గర జాతీయ రహదారి 163 పైన ఉన్న బ్రిడ్జి కూలిపోయిన ప్రాంతాన్ని సందర్శించి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే బ్రిడ్జి కూలిపోవడం జరిగిందని తెలియజేశారు.కత్తి హరీష్ గౌడ్ మాట్లాడుతూ బ్రిడ్జిని కనీస జాగ్రత్తలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయడం వల్లనే బ్రిడ్జి కూలిపోవడం జరిగిందని దిని వల్ల నిత్యం హన్మకొండ కు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాణ్యతతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,అధికారులు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని జాతీయ రహదారి బ్రిడ్జి త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని అన్నారు.కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మహేందర్, తదితరులు పాల్గొన్నారు