సి పి ఐ ములుగు మండల కార్యదర్శి ముత్యాల రాజు

ములుగు జిల్లా ఆగస్టు 11( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ముత్యాల రాజు అన్నారు.సోమవారం రోజున మార్కెట్ యార్డులో సిపిఐ రాష్ట్ర మహసభల పోష్టర్లను ఆవిష్కరించడం జరిగినది. సిపిఐ ములుగు మండల కార్యదర్శి ముత్యాల రాజు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఏర్పడ్డ సిపిఐ పార్టీ రాష్ట్ర మహసభలు ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఏర్పాటు చేయడం జరిగినదని,ఆ జెండాకు అండగా ఉండే కార్మికులు,కర్షకులు,హమాలీ,విధ్యార్థులు,మహిళలు, రెగ్యులర్,కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు,స్కీం వర్కర్స్,సబ్బండ వర్గాలు హజరై జయప్రదం చేయావలసినదిగా కోరారు. కార్యక్రమంలో రొంటాల రమేష్,ఇనుముల బిక్షపతి ఇనుముల రఘు,లెంకలపెల్లి రాజు,కుమార్,కుమార్,రవి, నరేష్,తదితరులు పాల్గొన్నారు