
పెద్దపల్లి జిల్లా ఆగస్టు 11( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ ) పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీధర్, ఆర్ బి ఎస్ కే డాక్టర్ సంతోష్ ఆసుపత్రి సిబ్బంది సమ్మయ్య, పారిజాతం, కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, హెల్త్ సూపర్వైజర్ అమృత పాల్గొన్నారు.