
వరంగల్, ఆగస్టు – 11(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
వరంగల్ లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఎండీ. సలీం, హనుమకొండకు వచ్చిన రాపిడీ బుకింగ్ లో యువతి మర్చిపోయిన పర్సును సహా ప్రయాణికుడు షరీఫ్ సహాయంతో పోలీసులకు అప్పగించాడు. ఆ పర్సులో 2 తులాల బంగారం ఉన్నట్లు యువతి గుర్తించడంతో, పోలీసులు ఆమెను విచారించి, గుర్తులు సరిపోలడంతో బంగారాన్ని ఆమెకు అప్పగించారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా సలీం చర్య నిలిచింది.