రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు జిల్లా ఆగస్టు 11( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనీ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కసంబంధిత అధికారులనుఆదేశించారు.సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను సీతక్క సందర్శించారు. మంత్రి సీతక్క జనరల్ హాస్పిటల్ వార్డులను,చికిత్స పొందుతున్న రోగులను,వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకన్నారు.ఇటీవల క్యాన్సర్ ఆపరేషన్ అయిన వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. , జనరల్ హాస్పిటల్ సూపరిన్ డెంట్ వి. రాజేంద్ర శేఖర్ డాక్టర్లను,హాస్పటల్ సిబ్బందిని అభినందించారు.జనరల్ విభాగంలో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి బిల్డింగ్ పై అంతస్తు నిర్మాణం చేపడతామని,ములుగు జిల్లాలో అన్ని రకాల ఆపరేషన్లు జనరల్ హాస్పిటల్ లోనే జరిపించడానికి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామనిమంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. జనరల్ హాస్పిటల్ సూపరిన్ డెంట్ వి చంద్రశేఖర్,అసిస్టెంట్ డైరెక్టర్ గఫర్,ఆర్ఎంఓ సంపత్ హాస్పటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు