వరంగల్, ఆగస్టు – 11(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. మాడిఫై చేసిన బైక్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీజ్ చేసిన సైలెన్సర్లను ఉపయోగించి విభిన్న ఆకారాలు “Noise Towers” తయారు చేసి నగరంలోని ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేశారు. రాత్రిపూట సైతం కనిపించేలా రేడియం స్టిక్కర్లు అంటించి శబ్ద కాలుష్యంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.