
Apr 21, 2025,
మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ : కాకినాడ జిల్లా పెద్దాపురంలో కలకలం రేగింది. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కుటుంబం సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగిన మహాలక్ష్మి, ఆమె భర్త, కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్యభర్తల పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళను కాకినాడకు తరలించారు. అయితే, వారి ఆత్మహత్యాయత్నానికి వడ్డీవ్యాపారుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది.