
ములుగు జిల్లా మే 6( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
భారతీయ జనతాపార్టీ ములుగు జిల్లా కార్యాలయంలో సంఘటన,సంరచన కార్యశాల సమావేశంను ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంటు ఇంచార్జీ తాడూరి శ్రీనివాస్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి,మాజీ పార్లమెంటు సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నిర్మాణం -సంస్ధాగతంగా పటిష్టం చేసి పార్టీ ని బలోపేతం చేయాలని, ములుగు జిల్లా లో కమలం జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క నాయకులు సైనికుడి వలే ఒక్క బిజేపి కార్యకర్త 100 మంది తో సమానం అనే విధంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని అధికార కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలు పక్షాన నిలబడి పోరాటం దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు నరేంద్రమోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మద్దతుగా పార్టీని ములుగు జిల్లాలో బూత్ స్థాయిలో బలోపేతం చేస్తూ మండల కార్యవర్గం బలమైన అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించి మండల కమిటీలు నిర్మాణం జరుగాలని ములుగు జిల్లా లో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా మండలఅధ్యక్షులు,నాయకులు సిద్దం కావాలని అన్నాడు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్యా జవహర్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవింద్రాచారి, జిల్లా ఉపాధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు, ఏనుగు రవిందర్ రెడ్డి, మల్లెల రాంబాబు,అడప బిక్షపతి,జిల్లా కార్యదర్శి వైదుగుల తిరుపతి రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవ రెడ్డి, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్,రాష్ట్ర పాలసీ రీసెర్చ్ మెంబర్ భూక్యా రాజు నాయక్, రాష్ట్ర ఎస్టీ మోర్చా అధికార ప్రతినిధి గుగులోతు స్వరూప,ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి రామరాజు,జిల్లా సీనియర్ నాయకులు కారుపోతుల యాదగిరి,అల్లె శోభన్,రవి రెడ్డి,జిల్లా నాయకురాలు చందా జ్యోతి, మహాలక్ష్మి, జిల్లా కౌన్సిల్ మెంబర్ రెడ్డి శ్రీనివాస్,వాసం సారయ్య,గద్దల హరిబాబు,జిల్లా ఓబిసి జిల్లా అధ్యక్షుడు దండిగ వెంకన్న,పల్ల బుచ్చన్న ఎస్సీమోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు, గండేపల్లి సత్యం,మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు పైడాకుల మల్లేశ్ మార్కసతీష్, తాల్లపల్లి ల్లక్ష్మణ్,వినుకోలు చక్రవర్తి,రావుల జానకిరాం, దుర్గం సమ్మక్క, యాదగిరి మురళి, సువర్ణపాక నరేందర్, జిల్లా నాయకులు సాంబశివుడు, సత్యనారాయణ,బైకాని మహేందర్,వీరన్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు
