
నిజాంపేట్ (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ ):
కత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలను హనుమంతరెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన కార్యాలయం లో ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది గంటలకు కొలను హనుమంత రెడ్డి కార్యాలయం లో కొలను రాజశేకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం అయిన జన్మదిన వేడుకలు రోజంతా సంబురంగా సాగాయి. హనుమంతరెడ్డి కి శుభాకాంక్షలు చెప్పడానికి దాదాపు కత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ నాయకులు వేలాదిగా తరలి వచ్చారు.
హనుమంతరెడ్డి కి శుభాకాంక్షలు చెప్పిన వారిలో కొలను శ్రీనివాస రెడ్డి, కొలను వీరేందర్ రెడ్డి, చిట్ల దివాకర్, టేకుల ప్రవీణ్ రెడ్డి, రామచంద్ర నాయక్, టేకుల మధు, నర్సింహా రెడ్డి తదితరులు ఉన్నారు.