ఆదివాసి నాయకపోడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్

ములుగు జిల్లా మే (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ఆదివాసీ నాయకపోడు జిల్లా నాయకులు ఆకుల రవి ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకుడు అమరవీరుడు మద్ది రామచంద్ర రావు వర్ధంతికి పూలమాలలు వేసి నమస్కరించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆదివాసి నాయకపోడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మాట్లాడుతూ ఆదివాసి నాయకపోడు తొలితరం నాయకుడు మద్ది రామచంద్ర అని అన్నారు.అహర్నిశలు ఆదివాసి నాయకపోడు జాతి గురించి కష్టపడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కడప చిత్తూరు తెలంగాణ లోని వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ మహబూబ్నగర్ జిల్లాలలో పాదయాత్రలు చేసి ఆదివాసి నాయక పోడు జాతిని ఏకం చేసి ఆదివాసి నాయకుడు హక్కుల కోసం పోరాడిన యోధుడు మద్ది రామచంద్రు అని అన్నారు.జాతిని ఐక్యతం చేసినప్పుడు మాత్రమే జాతి ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆదివాసీ నాయకపోడు హక్కులనుకాపాడుకుంటాము అని సూచనలు చేసిన వ్యక్తి మద్ది రామచంద్ర రావు అని అన్నారు.అతని యొక్క సేవలు వెలకట్టలేని 1990 శతకం నాటి ఆదివాసి అమరవీరులలో అతను కూడా ఒకరు అని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఆదివాసు నాయక పోడు జాతి మనుగడను కులదైవం లక్ష్మీ దేవర్లను కుర్రాజులను ఆదివాసి నాయకపోడు ఆరాధ్య దైవాలను వెలుగు తీసి జాతికి పరిచయం చేసిన యోధుడు మద్ది రామచంద్రు అని అన్నారు. ఆదివాసి తెగలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆదివాసి నాయక పోడు పూర్తిగా వెనుకబడిన తెగ ఆదివాసి నాయకపోడు తెగ అని ఈ యొక్క తెగ ఆర్ధికంగా, రాజకీయంలోనూ విద్యలోనూ వెనకంజనంలో ఉందని అన్నారు రాళ్ళను రెప్పలను వనాన్ని ఆసరా చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. మద్ది రామచందర్ ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్క ఆదివాసీ నాయకపోడు యువ నాయకులు ముందుకు రావాలని అన్నారు. జాతి కోసం పనిచేసే యువ నాయకులు వచ్చి హక్కుల కోసం కొట్లాడాలి హక్కుల కోసం పోరాటాలు చేయాలి ఉద్యమించాలి ఉద్యమ నాయకుడు లాగా ఎదగాలి ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి అని అన్నారు మేము కూడా మద్ది మద్ది రామచంద్రు ఆశయాలను నెరవేర్చే విధంగా అడుగులు వేస్తామని అతని యొక్క పోరు బాటలో మేము కూడా కొనసాగుతాము అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొత్త లక్ష్మయ్య కొత్త సదయ్య,జిల్లా నాయకులు ఆకుల రవి,కొత్త రవి,అరగల రమేష్,కొత్త రమేష్,అరిగెల సారయ్య, మండపు నరేష్,చిర్ర రాజేందర్, అరిగెల సంజీవ, ఆకుల రవి,అచ్చ రాజు,అచ్చ లక్ష్మణ్,కొత్త సమ్మయ్య, మోట్లపల్లి సరోజన, చిర్ర సుభద్ర,చిర్ర స్వరూప, చిరసారక్క,మండపు రమేష్, ఆరిగెల శ్రీధర్,ఆకుల శేఖర్, తదితరులు నాయకులు పాల్గొన్నారు