
ములుగు జిల్లా మే 10 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామానికి చెందిన పోరిక గోపి నాయక్ అనారోగ్య కారణంతో ఇటీవలే మృతి చెందడం జరిగింది.బిఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి మృతి చెందిన పోరిక గోపి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా 5,000/- రూపాయలు ఆర్థిక సాయం అందించారు.వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.