
ఏటూరునాగారం ములుగు జిల్లా మే (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా ఈ నెల 11న భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలపడం జరిగింది.ఆదివారం నాడు సాయంత్రం 3 గంటలకు ఏటూరునాగారం లోని అమరవీరుల స్తూపం నుండి ఓడ వాడ అభయ ఆంజనేయ స్వామి గుడి వరకు సాగనున్న ర్యాలీకి కాకులమర్రి లక్ష్మణ్ బాబు నేతృత్వం వహించ నున్నారు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సిందూర్ ను ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదంపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా దన్నుగా నిలవాలని లక్ష్మణ్ బాబు విజ్ఞప్తి చేశారు.మన తెలుగు బిడ్డ మన వీర సైనికుడు మురళి నాయక్ మన దేశం కోసం యుద్ధం చేసి వీరమరణం పొందాడు వారికి నివాళులు అర్పిస్తూ
అందులో భాగంగా భారత సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగామతాలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున తరలి రావాలని లక్ష్మణ్ బాబు పిలుపు నిచ్చారు