- జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి.

ములుగు జిల్లా జూన్ 23(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లాలోనివిద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో ఉన్న దుకాణాలు, వ్యాపార సముదాయాలలోసిగరెట్,గుట్కా,తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్.పి ప్రకటనలో తెలియజేశారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో ములుగు జిల్లాను కూడా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా,యువతను, ప్రజలను మమేకం చేస్తూ మత్తు మాదకద్రవ్యాల పై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండేందుకు గాను విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాలలో 100 గజాల పరిధిలో సిగరెట్,గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు మరియు మద్యం విక్రయించకూడదు అని తెలియజేశారు.విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇటువంటి కఠిన నిర్ణయాలు అమలుచేస్తున్నట్లు తెలియజేశారు.ఎవరైనా నిబంధనలు మీరినట్లయితే, దుకాణాలు లేదా వ్యాపార సముదాయాల పైన పొగకు ఉత్పత్తుల చట్టం 2003,జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ – 2015 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు