
ములుగు జిల్లా జూన్ 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా కేంద్రంలో ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరావు ఆదేశాల ప్రకారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ములుగు పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనదారుల ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్,హెల్మెట్,లేని వాహన దారులను తనిఖీ చేసి ఫైన్ వేయడం జరిగింది.వాహనదారులకు పలు సూచనలుచేస్తూ వాహనదారుడు వాహనం నడిపేటపుడు తప్పక హెల్మెట్ ధరించి మీ ప్రాణాలను కాపాడుకోవాలని తెలియజేశారు.కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్,రెడ్డి బిక్షపతి,టీజీఎస్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.