
ఫ్యాన్సీ నంబర్లతో తెలంగాణ రవాణాశాఖకు భారీ ఆదాయం
తెలంగాణ రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం చేకూరింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్ 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దక్కించుకున్నారు. టీజీ09 ఎఫ్ 0009 నంబర్‌ను రూ.6.70 లక్షలకు కమలయ్య హై సాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసింది. టీజీ09 ఎఫ్9999 నంబర్‌ను రూ.99,999కు ఇకో డిజైన్ స్టూడియో సంస్థ కొనుగోలు చేసింది.