బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా.జాడి రామరాజు నేత

ములుగు జిల్లా (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసి ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ప్రకటన చేసి 2సంత్సరాలు పూర్తి అయినప్పటికీ ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ఇంప్లిమెంట్ కాకా పోవడం వలన బిజెపి దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత ములుగు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది.జాడి రామరాజు మాట్లాడుతూ మైదాన ప్రాంతనాయకురాలు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఏజెన్సీప్రాంత దళిత బహుజన వర్గాల ప్రజల ఓట్లు కావాలి కాని అభివృద్ధి మైదాన ప్రాంతకావాలా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రెవిన్యూ డివిజన్ కోసం ఉత్తరం ఇచ్చినట్టు చేసింది అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక తెలంగాణ మంత్రి అయ్యాక ఇచ్చిన రెవిన్యూ డివిజన్ గురించి అసెంబ్లీ లో మాట్లాడి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ దళిత బహుజనమైనార్టీ వర్గాల అమాయకత్వంను ఆసరా చేసుకొని రెవిన్యూ డివిజన్ ఇంప్లిమెంట్ అయినట్టు పాలాభిషేకం చేపించుకున్నా మంత్రి రెవిన్యూ డివిజన్ ఇంప్లిమెంట్ ఎందుకు చెయ్యడం లేదో చెప్పాలని అన్నారు అదేవిదంగా ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు మైదానప్రాంత నాయకురాలు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మాటలు నమ్మి మరోసారి మోసపోకూడదని బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు అదేవిదంగా రెవిన్యూ డివిజన్ ఇంప్లిమెంట్ కాకపోతే అమర నిరాహార దీక్ష చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి కన్నాయిగూడెం ఉపాధ్యక్షులు కుమ్మరి సత్యం,మండల ప్రధాన కార్యదర్శి జనగాం ఆనంద్,బిజెపి నాయకులు సునారకాని సమ్మయ్య, కొండగొర్ల నార్సింగారావు, పాల్గొన్నారు.