ఆదివాసి,దళిత,గిరిజన, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ

ములుగు జిల్లా (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా కేంద్రంలోని రాయల్ ప్లాజాలో ఆదివాసి గిరిజన దళిత ప్రజాసంఘాల నాయకులు సమావేశమై కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గడ్ ప్రభుత్వంతో కలిసి మూడు కోట్ల ఆదివాసీల జీవనమును యుద్ధ యుద్ధ బీతికి నెట్టి వేసింది. అక్కడ నిర్వహిస్తున్న కగార్ సైనిక చర్య మూలంగా నిరాయుదులైన ఆదివాసీలు,మహిళలు,చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.అక్కడ ప్రజలు సాధారణ జీవితం గడపలేక భయానక జీవితమును గడుపుతున్నారు.తాగు నీరు ను సేకరించుకోలేని దీన స్థితిలో ప్రజలు వారికి వారే చనిపోయే స్థితికి చేరుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవన పరిస్థితినీ అర్ధం చేసుకునే విధంగా ప్రభుత్వాల తీరు లేదు, దేశ సరిహద్దు లలో యుద్దం జరుగుతున్న ప్రాంతాల లోని అక్కడి ప్రజలకు సాగు నీరు, తాగు నీరు, ఆహారము వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల కనీస ధర్మం కూడా పాటించకుండా ఆహారము, నీళ్లకు వైద్య సదుపాయాలను దూరం చేసి తమంతతామే చనిపోయే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ సైనిక చర్య ను నిలిపి వేసి,ఆదివాసి ప్రాంతం లో అభివృద్ది నీ స్థాపించుటకు తక్షణం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సమావేశం డిమాండ్ చేశారు.
బుధవారం రోజున ములుగు పట్టణ కేంద్రం లో “శాంతి ర్యాలీ” నిర్వహించి కలెక్టర్ కి మెమొరాండం ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. ఆదివాసుల పై అమానవీయ మైన మానవ హననాన్ని నిలిపి వేసి, కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని కోరుతూజరగబోయే శాంతి ర్యాలీలో యువత, బుద్ధి జీవులు, మహిళలు, ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, హక్కుల సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని శాంతి ర్యాలీ నీ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం వట్టం ఉపేందర్ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు,తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమనాల లక్ష్మయ్య, గోర్ సభ జాతీయ అధ్యక్షుడు జై సింగ్ రాథోడ్,తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, శాంతి కలగాలని కమిటీ సభ్యులు సోమ రామ్మూర్తి, ఎం ఆర్ పి ఎస్ జాతీయ నాయకులు గుగ్గిళ్ళ పీరయ్య, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గూగులోత్ కిషన్ నాయక్, గోర్ సభ రాష్ట్ర అధ్యక్షుడు మంగిలాల్ నాయక్, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి,ట్రైబల్ డెమోక్రాటిక్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ సింగ్,తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంపిడి వెంకటేశ్వర్లు, ఎల్ యచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమ్మయ్య రాథోడ్, ఏం ఆర్ పి ఎస్ జాతీయ నాయకులు నెమలి నర్సయ్య, భారత రాజ్యాంగ పరిరక్షణ నాయకులు జన్ను రవి, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్, ఏ యస్ యు రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఏ యస్ యు నాయకులు ఇర్ప సునిల్,తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య, రాష్ట్ర కార్యదర్శులు చింత కృష్ణ, పునేం బాలకృష్ణ, ములుగు,భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్, దుగ్గారపు వీరభద్రం తదితరులు పాల్గొన్నా