
హన్మకొండ, (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర చిత్రపటానికి జిల్లా అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు బసవేశ్వర చేసిన కృషిని కొనియాడారు.