
హన్మకొండ,(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
హనుమకొండ నగరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడిపిస్తున్న జూనియర్ కళాశాలలను మూసివేయాలని డీఐఈఓ గోపాల్‌కు స్వేరో స్టూడెంట్ యూనియన్ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలు విద్యా సమస్యలపై డీఐఈఓతో నేతలు చర్చించారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరీ సాయికుమార్, చెట్టుపల్లి శివకుమార్, సిద్ధార్థ, విక్రం, సాత్విక్, శ్రావణ్, జస్వంత్, సాయి, ముఖేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.