
హన్మకొండ, ఏప్రిల్ -30(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాజీపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను సీసీ కెమెరాలు, స్టేషన్ రిసెప్షన్ పని తీరుతో పాటు స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో ఎలాంటి నేరాలు జరుగుతాయి? రౌడీ షీటర్లు ఎంతమంది? మొదలైన విషయాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని సీపీ అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట కాజీపేట ఏసీపీ తిరుమల్ తదితరులు ఉన్నారు.