బిజెపి మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు

ములుగు జిల్లా ఏప్రిల్ 30( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు, రైతు నాయకులు జినుకల కృష్ణాకర్ రావు, బిజెపి నాయకులు ఇంచర్ల సొసైటీ కొనుగోలు సెంటర్ ని సందర్శించడం జరిగింది.సందర్బంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, రైతు నాయకులు జినుకల కృష్ణాకర్ రావు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ గద్దెనెక్కిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ అని అర కోర అంటే 40 శాతం రైతులకు రుణమాఫీ చేసి పూర్తి రైతులకు రుణమాఫీ చేసినట్టు అబద్ధాలు చెబుతూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరిగా మంత్రులు అందరూ భుకాయించడం సరైనది కాదు ఆరంభ సూరత్నం లాగా రైతు భరోసాను మూడు ఎకరాల వరకే వేయడం,రైతులకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం, పూర్తిగా బోనస్ఇవ్వకపోవడం, అతివృష్టి అనావృష్టి లో ఉపయోగపడే ఫసలు బీమా అమలు చేయకుండా రెండు సంవత్సరాలుగా రైతులను ఇబ్బంది పాలు చేయడం మంచిది కాదన్నారు.నీరు ఉండి లేక అరకొర పంటలతో పండించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ అండదండలతో ఒక క్వింటాకు ఐదు నుండి పది కిలోల చొప్పున కటింగులు చేస్తుంటే రైతులు కన్నీటి పాలవుతుంటే ఇక్కడి ఎమ్మెల్యే మంత్రి సీతక్క నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సరైనది కాదు ఇదే సీతక్క గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల వద్దకు వెళ్లి ధాన్యం సేకరణ,మిల్లర్ల కటింగ్ పెట్టడంపై ముసలి కన్నీరు కార్చిన విషయం, అధికారంలోకి రాగానే రైస్ మిల్లర్లతో రైతుల ధాన్యం కటింగ్ విషయం మాట్లాడకపోవడం రైతుల కన్నీటి బాధలు తెలుసుకునే తీరిక లేకుండా పోయిందా అని, రైతులు అష్ట కష్టాలకోర్చి పండించిన పంటను రైస్ మిల్లర్లు ఐదు నుంచి పది కిలోలు కటింగ్ పెట్టడం సరైనది కాదు అని, ప్రభుత్వ ప్రమేయమే లేకుంటే తక్షణం మిల్లర్లతో రైతుల ధాన్యాన్ని ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోలు చేయాలని, అదేవిధంగా అకాల వర్షాలతో ధాన్యము తడిసె అవకాశం ఉన్నందున కొనుగోలు సెంటర్లలో పాలిథిన్ పట్టాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు గన్ని బ్యాగులు తక్షణమే రైతులకు మరియు కొనుగోలు సెంటర్లలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.రైతులు కంటతడి పెడితే మిల్లర్లలకు ప్రభుత్వానికి మంచిది కాదు అని గమనించాలని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చేయాలని లేనిచో బిజెపి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో తనిఖీలు నిర్వహించి లేనియెడల పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుందని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గాదం కుమార్ మండల నాయకులు దొంతిరెడ్డి,వెంకట్ రెడ్డి వేల్పుకొండ రఘువీర్, ఆకుల రాజేందర్, అప్పాని సురేష్ తదితరులు పాల్గొన్నారు