ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు ఇరుప విజయ

ములుగు జిల్లా ( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు ఇరుప విజయ మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో అధికారంలో ఉండి ఏం చేశారని మీరు అడుగుతున్నారు కదా పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ములుగు జిల్లా చేశాడు ట్రైబల్ యూనివర్సిటీ కి భూములు సేకరించి గిరిజన యూనివర్సిటీ కోసం కేంద్రంతో కొట్లాడి తీసుకొచ్చిన కేసీఆర్ గిరిజనుల పట్ల ఆధార అభిమానాలు చూపించాడు మల్లంపల్లి మండలం కేసీఆర్ ఉన్నప్పుడే చేశాడు అది మేము చేశామని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు ములుగు మున్సిపాలిటీగా ప్రకటించింది కేసీఆర్ కాదా అది మర్చిపోతున్నారా మీరు అది కూడా మేమే తెచ్చామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు ఏటురునాగారం రెవెన్యూ డివిజన్ చేసింది వాస్తవం కాదా దాన్ని తుంగలో తోక్కారు నాగారం బస్టాండ్ బస్ డిపో తెచ్చింది కేసీఆర్ టైంలో కాదా ? ఏటురునాగారం అగ్నిమాపక కేంద్రం తెచ్చింది వాస్తవం కాదా గోదావరి పరివాహ ప్రాంతంలో కరకట్ట కేసీఆర్ టైంలో కదా శాంక్షన్ అయింది ఇప్పుడు ఎందుకు ఆగిందో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామపంచాయతీలను చేసిన చరిత్ర కేసీఆర్ కి ఉంది అందులో భాగంగానే కామారం గ్రామంలో రేగ కళ్యాణి సర్పంచ్ కావడానికి కూడా కేసీఆర్ ఏ కారణమనే సంగతి రేగ కళ్యాణి మర్చిపోతున్నావు మీ తాడ్వాయి గ్రామాలలో మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కనబడట్లేదా తాడ్వాయి మండలంతో సహా మీ గ్రామం కామారంతో సహా ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల నీళ్లు ఇస్తున్నది మీకు కనబడట్లేదా ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసిఆర్ ఉంటే మీరు వాటిని తుడిపేసే ఘనకార్యం లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కి ఎక్కడ పేరు వస్తుందోనని కెసిఆర్ కిట్టును తీసేసి అత్యధికంగా ఉన్న గిరిజనలు పేద ప్రజలు ఉన్న ములుగు జిల్లాలో కేసీఆర్ కిట్టును అందనీయకుండా చేసింది మీరు కాదా ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకుని కేసీఆర్ ని బడే నాగజ్యోతిని విమర్శించే నైతిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు అనేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన 420 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నది మీరు కాదా ములుగు జిల్లా వెనుకబడ్డ జిల్లా అని కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ములుగు నియోజకవర్గంలో కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి ఇచ్చింది నిజం కాదా దాంట్లో అప్పటి ఎమ్మెల్యే సీతక్క అనేక నిధులు దయాకర్ రావు గారి ద్వారా తెచ్చుకుని చేసింది వాస్తవం కాదా బడే నాగజ్యోతికి రాజకీయ బిక్ష పెట్టింది సీతక్క అని అనటం కూడా విడ్డూరంగా ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచిగా కాల్వపల్లి ప్రజలు గుండెల్లో ఉంచుకొని తనని గెలిపించుకున్నారు తప్ప సీతక్క దయా దక్షిణాల మీద కాదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని ఇంకొకసారి బడే నాగజ్యోతిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం