
ములుగు జిల్లా ( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వార్యంలో “ శ్రీ మహాత్మా బసవేశ్వరుడు ” జయంతి ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సిహెచ్ వీందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థను,వర్ణ భేదాలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత్ ధర్మం స్థాపకుడు , విశ్వగురువు మహాత్మా బసవేశ్వరుడు అనికోనియాడరు.ఇంకను ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన వారు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి బి.జయరాజు, ములుగు జిల్లా బిసి కార్యాలయ సిబ్బంది సంక్షేమ భవన కార్యాలయ సిబ్బంది. బిసి వెల్ఫేర్ శాఖా ఉద్యోగులు, నాలుగవ తరగతుల ఉద్యోగులు, విలేకరుల పాల్గొన్నారు.
