మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా ఏప్రిల్ 30( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ
శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ
శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి వరి కొనుగోలు పై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ యాసంగి పంట కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు.
ఎఫ్ ఏ క్యూ ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి కేటాయించబడిన రైస్ మిల్స్ కు పంపాలని ఆదేశించినారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోకుండా రైతులని ఇబ్బందికి గురి చేయడం వలన హనుమకొండ జిల్లాకి కేటాయించబడిన మిల్లులోకి ధాన్యం పంపవలసిందిగా ఆదేశించినారు. ములుగు జిల్లా రైస్ మిల్లులోకి ఈ రబీ సీజన్లతో ధాన్యం కేటాయించవద్దని అధికారులని ఆదేశించినారు. రైతు పండించే ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు అధైర్య పడకూడదని హామీ ఇచ్చినారు.ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు మేలుకోరే ప్రభుత్వం. ధాన్యం కొనుగోలులో ఏ రైతు కూడా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఉండాలని మంత్రి కోరారు. ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేసి హన్మకొండ జిల్లా రైస్ మిల్లులోకి ధాన్యం పంపవలసిందిగా అధికారులని ఆదేశించినారు. ధాన్యం కొనుగోలు పై అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. తాలు, తరుగు పేరిట ఎటువంటి కోతలూ పెట్ట వద్దని రైతులకు ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు.సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, డి ఎం సివిల్ సప్లయి రాం పతి, డి సి ఓ సర్దార్ సింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు
