
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి మే(3)
మద్దూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షతన రాజీవ్ యువ వికాసం పథకం పై మండల స్థాయి కమిటీ మరియు బి.సి,కార్పోరేషన్,ఎస్సీ కార్పోరేషన్,ఎస్టి కార్పోరేషన్, మైనారిటీ కార్పోరేషన్ ప్రతినిధులతో మండల ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్,దూల్మి ట్టకు సంబంధించి సమన్వయ సమావేశము నిర్వహించారు.ఈ సమావేశములో మండల ప్రత్యేక అధికారి రాధిక, మద్దూరు మరియు దూల్మిట్ట మండలములలో స్వీకరించిన దరఖాస్తుల వివరముల పై సమీక్షించనైనది. సమావేశమునకు ఎంపిడిఒలు రామ్మోహన్, వీరరాజు, ధూలిమిట్ట బ్యాంకుల ప్రతినిధులు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు,బ్రాంచి మేనేజర్ తదితరులు హాజరయ్యారు.
