
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి మే(3).
దూల్మిట్ట మండలం లోని జాలపల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు లోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లగా అక్కడ ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల లో నింపి వాగు నుండి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వాగులో పట్టుకున్న ట్రాక్టర్ల యజమానులు దాసరి శంకరయ్య, (తండ్రి) మల్లయ్య,చెట్కూరి ఆంజనేయులు (తండ్రి) వీరమల్లు,ఐలేని జగపతి (తండ్రి) నారాయణ, మేతుకు రమణారెడ్డి (తండ్రి) లక్ష్మా రెడ్డి ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయంకు తరలించడం జరిగింది.తహసీల్దార్ మధుసూదన్ ఒక్కో ట్రాక్టరు కు 10.000,రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగింది.మరియు మిగితా ఇద్దరు బంధారంసాగర్ (తండ్రి) నర్సింహులు, జక్కు నరేష్ (తండ్రి)గట్టయ్య, వారు పారిపోయారు యిట్టి విషయం మద్దూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయడం జరిగింది..