బిజెపి గోవిందరావుపేట మండల అధ్యక్షులు మార్క సతీష్

గోవిందరావుపేట ములుగు జిల్లా మే 3( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
గోవిందరావుపేట మండల కేంద్రంలోని పస్రా పట్టణంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మార్క సతీష్ ,బిజెపి జిల్లా ఓ బి సి ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ సమక్షంలో జన గణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది 60 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కుల గణన చేపట్టలేదు. బీసీల, హక్కులను కాలరాయడం, బీసీల రిజర్వేషన్లను అణచివేయడమే కాంగ్రెస్ చరిత్ర అని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు కానీ ఎస్సీలకుగాని ఎస్టీలకు గాని ఎవరికి కూడా మంత్రివర్గంలో సముచితటువంటి స్థానము ఇవ్వలేదని, 42 శాతం ఓబీసీలకు కేటాయించాలని చెప్పినటువంటి కాంగ్రెస్ తన మంత్రివర్గంలో ఎక్కడ కూడా ఓబీసీలకు ఆ స్థాయిలో కేటాయించలేదని కానీ బిజెపి ప్రభుత్వంలో ఓబీసీలకు,ఎస్సీలకు,ఎస్టీలకు తగినటువంటి సముచిత స్థానము ఇవ్వడం జరిగిందని అన్నారు.జన గణననలో కుల గణనను చేర్చడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశానికి అభినవ అంబేద్కర్గా నిలిచారు.శాస్త్రీయ పద్ధతిలో అన్ని కులాల వివరాలు సేకరించి, వారి సంక్షేమం కోసం ప్రణాళికలురూపొందించాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టనున్నారు నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం కులగణనకు ఎప్పుడూ సానుకూలంగానే ఉంది, శాస్త్రీయమైన కులగణన జరిగితే వెనకబడిన వర్గాలకు ఆర్ధిక – సామాజిక లాభాలు అందుతాయని మా నమ్మకం బిజెపి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారి విజయమని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ,60 సంవత్సరాలుగా కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలి ఇప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ధైర్యంతో కుల గణన చేపట్టింది.దీనిని మావల్లనే కుల గణన జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు ఉన్నారు.దేశ జనగణన లో భాగంగా కులగణనను చేపట్టి దాని ఆధారంగా వెనకబడిన వర్గాలకి ఆర్ధిక,సామజిక, సంక్షేమ లాభాలుచేకూర్చాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి, కర్ర సాంబశివారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి పశువుల బాబురావు,మండల ఓబీసీ అధ్యక్షులు కుంట మార్కండేయ,వాల్పదాస్ రవిశంకర్ ఆకుల రవి, యార్లగడ్డ నాగేశ్వరరావు, వీనుకోలు శ్రీనివాస్,ఎద్దునూరి రమేష్ వీనుకోలు సాంబయ్య సాబాది చంద్రబాబు రెడ్డి, అన్నారు వంగాల సోమిరెడ్డి, సామ మల్లారెడ్డి , మురళి,రాజమల్లు తదితరులు పాల్గొన్నారు
