
ములుగు జిల్లా మే 3 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అన్నారు.కాకలమర్రి లక్ష్మణ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్యర్యంలో అన్నదానం కార్యక్రమం,రోగులకు పండ్ల పంపిణీ చేశారు.కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, మాజీ ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, సత్యనారాయణ రావు, మండల ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి బాబు, సీనియర్ నాయకులు వేల్పుల సత్యం, గడ్డమీద భాస్కర్, బుల్లెట్ ఓదెలు, ఆదిరెడ్డి, ముడుతనపల్లి మోహన్, మెరుగు సంతోష్, దూడబోయిన శ్రీనివాస్, నేరెళ్ల శంకర్, వాకుండోత్ రాందాస్, గజ్జి నగేష్, సోషల్ మీడియా నాయకులు ఎండి నాజర్, కోడపాక మహేందర్, బొమ్మినేని సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

