బిజెపి జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్

మంగపేట ములుగు జిల్లా మే 3( ది టీమ్స్ ఆఫ్ తెలంగాణ)
మంగపేట మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలోని జనగణనలో కులగణనను చేర్పించడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని నిరూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీనని ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించినా ఏనాడు కూడా జనగణనలో కుల గణనను చేర్పించిన దాఖలు లేదని అంటూ ఇంత బృహోత్కరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నిర్వహించిన సందర్భంగా మండల నాయకులు అందరూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యరంగారి వీరన్ కుమార్, గుండు రాజేష్, రామ గాని నరేందర్, బట్ట బాబురావు, కాసర్ల మల్లారెడ్డి, తిరుపతి, సునీల్ కుమార్, గుండారపు రోహిత్ కుమార్, వై ప్రకాష్, కాక లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది
