
నిజాంపేట్ (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ ):
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 18 వ డివిజన్ లో పలు కాలనీల్లో రోడ్లు గుంతలమయమై స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి మరమ్మతు పనులు శనివారం రాత్రికి రాత్రి పూర్తిచేయించడం పట్ల, రాత్రంతా తన అనుచర మిత్రులతో కలసి పనులు పర్యవేక్షించడమే కాక నూతన కాంక్రిట్, వాహనాల రాకపోకలతో పాడు కాకుండా ట్రాఫిక్ ను నియంత్రించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వీరేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు మారమ్మత్తు పనులకు అన్నివిధాలా సహకరించి, 18 వ డివిజన్ అభివృద్ధి సహకరిస్తున్న అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.