జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు

గోవిందారావుపేట ములుగు జిల్లా మే 6( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
గోవిందారావుపేట మండలం లోని కొడిశాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని ఆశా డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు సందర్శించి మాట్లాడుతూ, గ్రామాలలో అవగాహన కార్యక్రమాల ద్వారా ఆశా కార్యకర్తలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. రక్తపోటు మధుమేహం క్యాన్సర్ లాంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించి నాలుగో విడత స్క్రీనింగ్ పరీక్షలకు ప్రజలు ముందుకు వచ్చేటట్లు చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలని, దానితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని తెలిపారు.గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహార ప్రాముఖ్యతను, సాధారణ ప్రసవాల లాభాలను, తల్లిపాల ప్రాముఖ్యతను ,వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతలను ప్రజలకు వివరించి ప్రభుత్వ సేవలను వినియోగించుకునేటట్లు చేయుటలో ఆశా కార్యకర్తల ప్రాముఖ్యత ఎంతో ఉందని తెలియజేశారు. జాతీయ టీబి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ప్రతి ఆశా కార్యకర్త తమ విధిగా, 10 తెమడ పరీక్షల చొప్పున చేయించాలని, టీబి వ్యాధిగ్రస్తులుగా నిర్ధారణ అయినవారికి ,టీబి మందులను అందజేసి, టీబి వ్యాధి వ్యాప్తిని అరికట్ట వచ్చునని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను, ఐ. వి ఫ్లూయిడ్స్, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉండేటట్లు చూడాలని వైద్యాధికారికి, సిబ్బందికి సూచించారు.కార్యక్రమంలో కొడిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. పవన్ కుమార్, సూపర్వైజర్స్ పద్మ, బాలు నాయక్, ఆరోగ్య కార్యకర్త సీతారాం నాయక్, ల్యాబ్ టెక్నీషియన్ పండు, ఫార్మసిస్ట్ వెంకట్, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు