
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి మే(6).
చేర్యాల ఆబ్కారీ శాఖలో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న గూగులోతు సువర్ణ దూల్మిట్ట మండలం లోని దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని చెలిమేతండా లో నాటు సారా విక్రస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ ఫరిద్,కానిస్టేబుల్లు రవి,శ్రీలత,నర్సింలు లతో కలిసి తండాకు వెళ్లి పిరియా అను వ్యక్తి ఇంట్లో తనిఖీ నిర్వహిస్తుండగా పక్కన ఇంట్లో వ్యక్తి ముడవత్ సంతోష్ అనే వ్యక్తి మేము తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో అక్కడకి వచ్చి మాపై ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, పక్కనే ఉన్న గ్రానైట్ రాయితో విసిరిగొట్టగా ఆబ్కారీ శాఖ ఎస్సై ఎడమ మోచేతికి గాయమైనదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మద్దూరు ఎస్ఐ ఒక ప్రకటనలో విలేకరుల కు తెలిపారు.
