
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి మే(6).
దూల్మిట్ట మండలం లోని కుటీగల్ గ్రామానికి చెందిన కలకుంట్ల ఇందిర (భర్త) సంపత్ ఉపాధి హామీ పనికి వెళ్లి వస్తుండగా దేవులపల్లి బాలయ్య ఇంటి వద్దకు చేరుకోగానే మా గ్రామానికి చెందిన గౌరవేని రవి (తండ్రి) వెంకటయ్య రోడ్డుకు అడ్డంగా నిలబడి పోకుండా అడ్డుకోవడం తో ఇందిర వారిని తిట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది కొద్దీ సమయం తర్వాత రవి,వెంకటయ్య లు ఇద్దరు కలిసి కలకుంట్ల ఇందిర ఇంటికి వెళ్లి వాకిట్లో ఉన్న ఆమెను కర్రతో తలపై ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో తలకు రక్త గాయం అయినది. ఇట్టి విషయంపై మద్దూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మద్దూరు ఎస్ఐ ఒక ప్రకటనలో విలేకరుల కు తెలిపారు.
