
వరంగల్, మే -6 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
వరంగల్ లోని గీసుగొండ మండలం ధర్మారం శివారులో ఉన్న K – స్ట్రీట్ లో వరంగల్ జిల్లా చైర్మన్ గంగుల అశోక్ ఆద్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిటీ(NHRC) ఉమ్మడి జిల్లా ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా స్టేట్ ఛైర్మన్ హాజరై వరంగల్ లో అజమ్ జహి మిల్లు లో పనిచేసిన కార్మికులకు చెందాల్సిన భూమిని వారికే కేటాయించాలని, ఆ భూమి కోసం ఎంతటి పోరాటమైన చేస్తాం అని చెప్పారు.వరంగల్ లో గంజాయి సరఫరా ఎక్కువ అయిందని, గంజాయి ద్వారా స్కూల్ పిల్లలు కూడా జీవితాలు నాశనం అవుతున్నాయని, వీటిని నిషేధించాలని,
అదే విధంగా వరంగల్ లోని భూదందాలు, సెటిల్మెంట్లు మీది పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని మాట్లాడారు.

వరంగల్ జిల్లా చైర్మన్ గంగుల అశోక్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కార్పొరేట్ విద్య సంస్థలో కనీస సౌకర్యాలు లేక జిల్లా విద్యాశాఖ అధికారులకు లక్షల్లో లంచాలు పోసి noc లు, పర్మిషన్లు తెచ్చుకొని ప్రజల నుండి లక్షల్లో స్కూల్ ఫీజులు కట్టించుకుంటున్నారు,
అలాగే జిల్లా లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు ప్లెడ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలు ఆడుతున్నారని మండి పడ్డారు. ఈ ఆత్మీయ సమ్మేళనంకు హన్మకొండ జిల్లా చైర్మన్ దుబాసి నవీన్, గ్రేటర్ వరంగల్ చైర్మన్ సరళ దేవి, స్టేట్ జాయింట్ సెక్రటరీ బాలినే లక్ష్మి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు మరియు మండల కమిటీ సభ్యులు పాల్గొనారు.