
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై”ఆపరేషన్ సిందూర్” పేరుతో దాడులు చేసింది.దీనికి పెట్టిన పేరులోనే పాక్‌కు ఓ సందేశం ఉంది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొన్నారు.వారు టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధువరులు వినయ్ నర్వాల్,హిమాన్షి ఉన్నారు.ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు.యోధులకు పెట్టే వీరతిలకం అర్థం కూడా దీనిలో ఉంది.