
ములుగు జిల్లా మే 17 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)ములుగు జిల్లా ఎస్సీ డాక్టర్. శబరీష్.పి,తెలిపిన వివరాలు ప్రచారం నిషేధిత సిపిఐ మావోయిస్టులు ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు,పేరూరు,పోలీస్ స్టేషన్ పరిధిలో చత్తీస్గడ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా ఎలిమిడి, ఉసురు,పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో భద్రత బలగాలు,ఇతరులు ప్రవేశించకుండా చెయ్యడానికి మావోయిస్టు గెరిల్లా బేస్ స్థాపించేందుకు ఐఈడీలు అమర్చినారు.నిషేధిత సిపిఐ మావోయిస్టు గల కొంతకాలం గా కర్రిగుట్టలను కేంద్రం గా చేసుకుని చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండడంతో ఇటీవల సి ఆర్ పి ఎఫ్, కేంద్ర బలగాలు, చత్తీస్గఢ్ పోలీసులు, భారీ స్థాయిలో కర్రెగుట్టలపై సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.కర్రెగుట్టలపై జరుగుతున్న గాలింపు చర్యల నేపథ్యం లో అక్కడ ఆశ్రయం పొందిన సిపిఐ మావోయిస్టు లు అక్కడి నుండి తప్పించుకుని చిన్న చిన్న గ్రూపులు గా వివిధ ప్రదేశాలకు పారిపోతున్నారు.అని ములుగు పోలీసులకు సమాచారం ఉన్నది.ఈ నేపథ్యం లో ప్రజల ములుగు జిల్లా లోని నిషేధిత సిపిఐ మావోయిస్టులను ప్రవేశించకుండా ములుగు జిల్లా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి అన్నీ విధమైన చర్య లను చేపట్టింది.ఈ క్రమంలో 16-5-2025 న మధ్యాహ్నం వెంకటాపురం పోలీస్ స్టేటస్ పరిధిలో పాలేం ప్రాజెక్టు వద్ద వాహనాల తనిఖీలో ఆరు గురు నిషేధిత సి పిఐ మావోయిస్టు అరెస్టు చేయడం జరిగింది.17 5 2025ఉదయ్ వాజేడు పోలీస్ స్టేషన్ పరధిలో మీరు మూల అటవీ ప్రాంతంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో 7 మంది న నిషేధిత సి పిఐ మావోయిస్టులను,కన్నాయిగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో గుట్టల గంగారం గుత్తి కొయ్య గ్రామ సమీపం లో చేపట్టి పెట్రోలింగ్ లో ఏడు గురు నిషేధిత మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అరెస్టు చేసిన మొత్తం 20 మంది మావోయిస్టులు ఇచ్చిన సమాచార ఆధారంగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు.
