
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు జూన్(23).మానేపల్లి ప్రభాకర్.
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
వర్ధంతి సందర్భంగా ధూళిమిట్ట మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు కొడం యాదగిరి ఆద్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం అన్ని గ్రామాలలో ఆయన చిత్ర పటానికి పులమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ నిజమైన దేశభక్తుడు తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన దార్శనిక నాయకుడుఈ గంభీరమైన రోజున, మేము వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము.
డాక్టర్ శ్యామా ప్రసాద్ మూకర్జీ, ఆయన త్యాగాలు మరియు ఆదర్శాలు మనకు స్ఫర్తినిస్తూనే ఉన్నాయి.
ఒకే దేశం – ఒకే రాజ్యాంగం అనే ఆయన దార్శనికత భారతదేశ ఐక్యత మరియు సమగ్రతకు పునాది వేసింది బిజెపి కుటుంబం తరపున వారి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్యవర్గ సభ్యులు బానోత్ లక్ష్మణ్ నాయక్, మరియు సిద్దిపేట జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షులు ధరావత్ బిక్షపతి నాయక్, మండల నాయకులు ఐలేని మహిపాల్ గౌడ్ ,మండల ఉపాధ్యక్షులు మల్కాపురం రమేష్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి గుత్తి భూపాల్ ,కార్యదర్శి శ్రీరాముల శరత్, తదితరులు పాల్గొన్నారు..