- డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్

ములుగు జిల్లా జూన్ 23(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దరఖాస్తులు తప్ప అమలుకు నోచుకోవడం లేదని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయకుండా వెంటనే రుణాలు మంజూరు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించాడానికై రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా రూపాయలు 50వేల నుండి రూపాయలు 5 లక్షల వరకు రుణాలను ఇస్తామని 6వేల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు.ఈ పథకానికి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు 16 లక్షలా 25వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాజీవ్ యువ వికాస్ పతకం లబ్దిదారులకు నిధులను మంజూరు చేస్తామని ప్రచారం చేసి వాయిదా వేసిందన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా కాలయాపన చేయకుండా రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన లబ్దిదారుల అందరికి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సివిల్ స్కోర్ లేకున్నా నిరుద్యోగ యువతకు పథకాన్ని అమలు చేయాలని, లేనిపక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.రాజీవ్ యువ వికాస్ రుణాలు మంజూరు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని అన్నారు.కార్యక్రమంలో
జిల్లా నాయకులు నరేష్, రవీందర్,తదితరులు పాల్గొన్నారు