
వరంగల్, జూన్ – 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వరంగల్ ఆధ్వర్యంలో జులై 1న డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ను మంగళవారం ఐఎంఏ అధ్యక్షుడు డా. నాగార్జున రెడ్డి, కార్యదర్శి డా. అజిత్ మహమ్మద్, తెలంగాణ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. ప్రవీణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. డాక్టర్స్ డే వేడుకలను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.