/**
* The header for our theme
*
* This is the template that displays all of the
section and everything up until
*
* @link https://developer.wordpress.org/themes/basics/template-files/#template-partials
*
* @package MoreNews
*/
?>
రీల్స్ చేస్తూ పడిపోయి.. అత్యాచార నాటకం! - The Times Of Telangana
సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో పోలీసులను యువతి తప్పుదోవ పట్టించిందని రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. సెల్‌ఫోన్‌తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు ఆమె తెలిపారు. పోలీసులకు కట్టుకథ చెప్పి తనపై అత్యాచారం జరిగినట్లు ఆ యువతి పోలీసులను నమ్మించినట్లు నిర్ధరించారు.
Railway Police: ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం.. అవాస్తవం: రైల్వే ఎస్పీ సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో పోలీసులను యువతి తప్పుదోవ పట్టించిందని రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. సెల్‌ఫోన్‌తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు ఆమె తెలిపారు. పోలీసులకు కట్టుకథ చెప్పి తనపై అత్యాచారం జరిగినట్లు ఆ యువతి పోలీసులను నమ్మించినట్లు నిర్ధరించారు. దర్యాప్తులో భాగంగా సుమారు 300కుపైగా సీసీ కెమెరాలను రైల్వే పోలీసులు పరిశీలించారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. ఆ తర్వాత యువతిపై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చారు. న్యాయసంబంధమైన అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నారు. మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువతిపై ఓ యువకుడు ఎంఎంటీఎస్ రైలు బోగీలో అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.